బాంబు బెదిరింపులతో యూరప్‌లో విమానాలు ఆగమాగం
బాంబు బెదిరింపుల కారణంగా గురువారం ఉదయం ఐరోపా అంతటా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఐరోపాలో విమానాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస బెదిరింపుల్లో ఇది తాజా ఘటన.
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపుల కారణంగా గురువారం ఉదయం ఐరోపా అంతటా విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఐరోపాలో విమానాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస బెదిరింపుల్లో ఇది తాజా ఘటన. డబ్లిన్ నుంచి రోమ్కు వెళుతున్న ఏరో లింగస్ విమానం ఈఎల్402 భద్రతా చర్యగా దారి మళ్లించిన తర్వాత పారిస్‌కు పశ్చిమాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవ్రెక్స్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగినట్టు ఐరిష్ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
బ్రస్సెల్స్‌లోని జావెంటెమ్ విమానాశ్రయంలో అనుకోని విధంగా దిగవలసి వచ్చిన విమానం పోలిష్ విమానయాన సంస్థ ప్లాట్‌కు చెందినదని బెల్జియం మీడియా పేర్కొంది. ఈ బెదిరింపులకు ఏ దేశమూ బాధ్యత వహించనప్పటికీ వీటిని ‘హైబ్రిడ్ దాడులు’, విధ్వంసక చర్యలుగా అభివర్ణిస్తూ రష్యా, ఇరాన్‌లను ఐరోపా అధికారులు నిందిస్తుండగా ఆ రెండు దేశాలు మాత్రం ఈ దాడుల ప్రచారాన్ని ఖండించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

