హిమాచల్‌లో 4 సీట్లూ బీజేపీవే
హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలను బీజేపీ మ రోసారి క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరుసగా ఐదోసారి హమీర్పురి లోక్‌సభ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ మూడు సీట్లు గెల్చుకున్న బీజేపీ, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లను గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది.
- మండీలో కంగన విజయం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలను బీజేపీ మ రోసారి క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరుసగా ఐదోసారి హమీర్పురి లోక్‌సభ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ మూడు సీట్లు గెల్చుకున్న బీజేపీ, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లను గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రాజీవ్ భరద్వాజ్ తొలిసారిగా మండీ, కంగ్రా సీట్లలో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కాశ్యప్ సిమ్లాలో విజయం సాధించారు. అయితే ఐదు సీట్లలో బీజేపీ విజయం సాధించినప్పటికీ 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం 69.71 నుంచి 56.44కు తగ్గగా, కాంగ్రెస్ ఓటు శాతం 23.53 నుంచి 41.67కు పెరిగింది. కాగా, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నాలుగు, బీజేపీ రెండు గెల్చుకున్నాయి. రాజ్యసభ ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా ఓటేశారన్న ఆరోపణతో ఆరుగురు కాంగ్రెస్ ఎంఎల్ఏలపై బహిష్కరణ వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

