AP Elections | ఏపీ ఎన్నికలు.. ఆరు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ..!
AP Elections | ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పొత్తులో బీజేపీ కూడా కలవబోతున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం చర్చలు జరిపారు.
AP Elections | న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పొత్తులో బీజేపీ కూడా కలవబోతున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం చర్చలు జరిపారు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అయితే పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన 2 స్థానాల్లో బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇక మిగిలిన 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో తెలుగు దేశం పోటీ చేయనుంది. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాన్, చంద్రబాబు కలిసి ప్రకటించారు. తాజాగా బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన 145 స్థానాల్లో టీడీపీనే బరిలో దిగనుంది. అయితే బీజేపీ వైజాగ్, విజయవాడ, అరకు, రాజంపేట్, రాజమండ్రి, తిరుపతి స్థానాలపై దృష్టి పెట్టింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు కైవసం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటోంది బీజేపీ.
అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఈ చర్చల సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. ఏపీ, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspended | అడ్డగూడూర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి సస్పెండ్
Superstar Rajinikanth | గ్రీస్‌లో రజనీకాంత్ కుటుంబం సందడి.. మనవళ్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్!
KTR | సమైక్య పాలనలో కన్నా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అతి పెద్దది : కేటీఆర్
Mouni Roy | బ్లాక్ డ్రెస్‌లో మౌనీ రాయ్ గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేరు!
Actress Anita | కొడుకు పుట్టినరోజు వేడుకకు వెళ్దామంటే.. నటి అనితను నిలువునా ముంచిన సైబర్ కేటుగాళ్లు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

