భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తాజాగా పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఆ ఎంపీ .. బాస్కెట్‌బాల్ ఆడుతూ కూడా కనిపించారు. చాలా హుషారుగా ఆమె దర్శనమిచ్చారు. అయితే భోపాల్‌లోని తన ఇంట్లోనే ఈమధ్యే ఇద్దరి అమ్మాయిల పెళ్లి చేసింది ప్రజ్ఞా. అప్పగింతల వేళ డీజే మ్యూజిక్ సమయంలో ఆమె స్టెప్పులేశారు. అంతేకాదు.. ఆహ్వానితులను కూడా డ్యాన్స్ చేసేందుకు ప్రోత్సహించారు. సరదాగా ప్రజ్ఞా డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఇక కాంగ్రెస్ ఎంపీ నరేంద్ర సలూజా సెటైర్ వేశారు. ఆయన తన ట్విట్టర్లో ఆ వీడియోను పోస్టు చేస్తూ.. ఎంపీ ప్రజ్ఞా ఎప్పుడూ ఇలాగే చెలాకీగా ఉండాలన్నారు. ఠాకూర్‌ను ఇలా చూడడం సంతోషం వేస్తోందన్నారు. నిజానికి మాలేగావ్ పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రజ్ఞా.. ఆరోగ్య కారణాల చేత విచారణకు హాజరుకావడం లేదు. వీల్‌చైర్‌లో ఉన్న ఆమె .. విచారణ నుంచి మినహాయింపు కోరారు. కానీ బాస్కెట్‌బాల్ ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ కనిపించిన ప్రజ్ఞాపై కాంగ్రెస్ ఎంపీ ఆగలేక సెటైర్ వేశారు.