బెంగళూరు, మే 18: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 91వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ‘మన మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు శుభాకాంక్షలు. దేశానికి దేవెగౌడ చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవి. ఆయనకు మరింత ఆయురారోగ్యాలు సమకూరాలని దేవుని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి ట్వీట్లో తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనే తన మార్గదర్శి, స్ఫూర్తి, బలం అంటూ వ్యాఖ్యానించారు.