నాలుగు రాష్ట్రాల్లో ఆరుగురు భార్యలు.. బావమరిదికి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన అంతరాష్ట్ర పెళ్లికొడుకు
రెండో భార్య మంజు సోదరుడు వికాస్, మరో భార్యతోపాటు ఉన్న చోటూను చూశాడు. వెంటనే అతడ్ని పట్టుకుని తన కుటుంబ సభ్యులను అక్కడకు రప్పించాడు.
పాట్నా: నాలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మహిళలను ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈ అంతరాష్ట్ర పెళ్లికొడుకు చివరకు ఒక బావమరిదికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవతారి గ్రామానికి చెందిన చోటూ కుమార్ ఒక ఆర్కెస్ట్రా బృందంలో గాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాల్లో కచేరీల సందర్భంగా పరిచయమైన ఆరుగురు మహిళలను అతడు పెళ్లాడాడు. వారితో పిల్లల్ని కూడా కన్నాడు.
కాగా, సోమవారం సాయంత్రం కోల్‌కతాకు వెళ్లేందుకు జముయి రైల్వే స్టేషన్‌ను చేరుకున్న రెండో భార్య మంజూ సోదరుడు వికాస్, మరో భార్యతోపాటు ఉన్న చోటూను చూశాడు. వెంటనే అతడ్ని పట్టుకుని తన కుటుంబ సభ్యులను అక్కడకు రప్పించాడు. దీంతో వారంతా కలిసి చోటూను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 2018లో తన కుమార్తె మంజూను చోటూ పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి కోబియా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. ఏడాదిన్నర కిందట మందులు తీసుకువస్తానని చెప్పి బయటకు వెళ్లిన చోటూ ఇంటికి తిరిగి రాలేదని ఆమె ఆరోపించింది. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన కళావతి దేవిని అతడు మొదటి పెళ్లి చేసుకున్నాడని, వారికి నలుగురు పిల్లలున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు, చోటూను పోలీసులు ప్రశ్నించగా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు అతడు చెప్పాడు. బీహార్‌లోని చిన్వారియా, సుందర్‌కండ్ ప్రాంతాలకు చెందిన మహిళలతోపాటు జార్ఖండ్‌లోని రాంచీ, డియోఘడ్‌లో ఒక్కో మహిళను, మహారాష్ట్రలోని సంగ్రామ్పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళను, ఢిల్లీకి చెందిన మరో మహిళను అతడు పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అందరి భార్యలతో పిల్లలను కలిగి ఉన్నట్లు చెప్పారు. రెండో భార్య మంజూ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఫిర్యాదు చేశారని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

