Congress : కాంగ్రెస్‌లోకి భోజ్‌పురీ హీరోయిన్ రాణి ఛటర్జీ
Congress : యూపీ ఎన్నికల వేళ.. కీలక నేత ఆర్పీఎన్ సింగ్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రోజే కాంగ్రెస్‌కు సినిమా బలం దొరికింది. భోజ్‌పురీ

Congress : యూపీ ఎన్నికల వేళ.. కీలక నేత ఆర్పీఎన్ సింగ్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రోజే కాంగ్రెస్‌కు సినిమా బలం దొరికింది. భోజ్‌పురీ సినిమా హీరోయిన్ రాణీ ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఉన్న ఓ ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రియాంక గాంధీకి కూడా ధన్యవాదాలు ప్రకటించారు. నేను మహిళను.. పోటీలో నిల్చుంటాను అన్న నినాదాన్ని కూడా ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల బరిలోకి దిగడానికి మరో మహిళ కూడా సై అంటోంది. లడ్కీ హూ.. లడ్ సక్తీహూ (నేను మహిళను.. బరిలోకి కూడా దిగే సత్తా వుంది) ఈ నినాదంతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ రాణి ఛటర్జీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

