Gramin Bharat Bandh | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్..! రోడ్లపై నిరసన తెలుపనున్న రైతులు..!
Grameena Bharat Band | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన తెలుపనున్నారు.
Gramin Bharat Bandh | ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన తెలుపనున్నారు. పంజాబ్‌లో నిరసన సందర్భంగా రాష్ట్ర, జాతీయ రహదారుల్లో గణనీయమైన భాగాన్ని నాలుగు గంటల పాటు మూసివేయనున్నారు. బీకేయూ ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లోఖోవాల్ గ్రామీణ భారత్ బంద్‌కు సంబంధించిన వ్యూహాన్ని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి హామీ ఇచ్చే చట్టంతో సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నిరసనకు పిలుపునిచ్చాయి.
ఎస్కేఎం నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ (NCC) సభ్యుడు డాక్టర్ దర్శన్ పాల్ మాట్లాడుతూ డిసెంబర్లోనే గ్రామీణ భారత్ బంద్‌కు ప్లాన్ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ పనులు, ఉపాధిహామీ పనులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికులెవరూ పని చేయరన్నారు. అంబులెన్స్‌లు, వివాహాలు, చావులు, మెడికల్ షాపులు, వార్తాపత్రికల సరఫరా, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. కూరగాయలు, ఇతర పంటల క్రయవిక్రయాలు, కొనుగోళ్లు నిలిచిపోతాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

