Suicide | డబ్బు కోసం వివాహిత బ్లాక్ మెయిల్.. ఫిట్నెస్ ట్రెయినర్ ఆత్మహత్య..!
Suicide | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో విషాద ఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ వివాహిత పెట్టే వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తాళలేక 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ (Gym trainer) ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Suicide : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో విషాద ఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ వివాహిత పెట్టే వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తాళలేక 28 ఏళ్ల జిమ్ ట్రైనర్ (Gym trainer) ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రస్థాయి ఫిట్నెస్ ట్రైనర్ అయిన దిలీప్ (Diip) ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ తర్వాత యోగిత (Yogita) అనే మహిళ నుంచి దిలీప్ సోదరికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది.
దిలీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ మెసేజ్‌లో ఉండటంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. వెంటనే గది తలుపులు బద్దలుకొట్టి చూడగా.. దిలీప్ విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. దిలీప్‌కు జిమ్‌లో 42 ఏళ్ల వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర బంధంగా మారడంతో ఆమె డబ్బు, ఆస్తి కోసం దిలీప్‌ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. గతంలో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగా ఆమె భర్త సమక్షంలో ఇద్దరికీ రాజీ కుదిర్చారు.
అయినప్పటికీ ఆమె వేధింపులు ఆపలేదని, నిరంతరం వేధించడంతోనే దిలీప్ ప్రాణాలు తీసుకున్నాడని అతడి కుటుంబం ఆరోపిస్తోంది. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని దిలీప్ కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

