ఇంటిని కూల్చేస్తున్నారని.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న దంపతులు
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కేఆర్ పురంలోని ఎస్ఆర్ లే అవుట్లో అక్రమ కట్టడాలను
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కేఆర్ పురంలోని ఎస్ఆర్ లే అవుట్లో అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక అధికారులు చేరుకున్నారు. అక్కడ నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు బుల్డోజర్ వచ్చింది.
దీంతో ఆ ఇంటి దంపతులు సునీల్ సింగ్, సోనా సేన్ కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. ఇక అగ్గిపుల్ల కూడా ఆమె వెలిగించింది. కానీ అదృష్టవశాత్తు ఆ అగ్గిపుల్ల వెలగలేదు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు కలిసి వారిపై నీళ్లు గుమ్మరించి, ప్రాణాలతో కాపాడారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సునీల్ సింగ్, సోనా సేన్ మాట్లాడుతూ.. తమ ఇంటిని అక్రమంగా నిర్మించుకోలేదన్నారు. తమ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు, పోలీసులు వినిపించుకోకుండా ఇంటిని కూల్చేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

