wins lottery | రూ.75 లక్షల లాటరీ గెలిచిన కూలీ.. ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాడు, ఎందుకంటే?
wins lottery | ఒక కూలీ రూ.75 లక్షల లాటరీ గెలిచాడు (wins lottery). అయితే భయాందోళన చెందిన అతడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాడు. తన లాటరీ టికెట్ ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. అలాగే లాటరీ డబ్బులు ఎలా పొందాలి అని కూడా పోలీసులను అడిగాడు.
తిరువనంతపురం: ఒక కూలీ రూ.75 లక్షల లాటరీ గెలిచాడు (wins lottery). అయితే భయాందోళన చెందిన అతడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాడు. తన లాటరీ టికెట్ ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. విస్తూపోయే ఈ సంఘటన కేరళలో జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్కే బాదేశ్ వలస కూలీగా కేరళకు వచ్చాడు. ఎర్నాకులంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నాడు. కేరళ ప్రభుత్వం విక్రయించే లాటరీ టికెట్‌ను ఇటీవల అతడు కొన్నాడు. మంగళవారం రాత్రి ఫలితాలు చూసుకున్న అతడు తాను కొన్న లాటరీ టికెట్‌కు రూ.75 లక్షలు గెలుచుకున్నట్లు తెలుసుకున్నాడు.
కాగా, బెంగాల్‌కు చెందిన బాదేశ్, కేరళకు కొత్తగా రావడం, మలయాళం తెలియకపోవడంతో ఏమి చేయాలో అతడికి తెలియలేదు. భయాందోళన చెందిన అతడు వెంటనే తన స్నేహితుడు కుమార్‌ను పిలిచి సహాయం కోరాడు. ఆ తర్వాత అతడితో కలిసి మువట్టుపుజ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తాను గెలిచిన లాటరీ టికెట్‌ను ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని కోరాడు. అలాగే లాటరీ డబ్బులు ఎలా పొందాలి అని కూడా పోలీసులను అడిగాడు. దీంతో పోలీసులు లాటరీ డబ్బు తీసుకునే విధానం గురించి వివరించారు. అలాగే అతడికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
మరోవైపు బాదేశ్ గతంలో కూడా చాలాసార్లు లాటరీ టికెట్లు కొన్నాడు. ఎప్పుడూ కూడా డబ్బులు గెలుచుకోలేదు. అయితే కేరళలో కొన్న లాటరీకి ఏకంగా రూ.75 లక్షలు తగలడంపై అతడి ఆనందానికి అంతులేకుండా పోయింది. కేరళలో తనకు అదృష్టం దక్కడం పట్ల అతడు మురిసిపోయాడు. లాటరీ డబ్బులు పొందిన తర్వాత బెంగాల్‌లోని సొంతూరుకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటిని బాగు చేయించుకోవడంతోపాటు మరికొంత పొలం కొని వ్యవసాయం చేసుకోవాలని భావిస్తున్నాడు.
Also Read:
Viral Video: జాబ్ నుంచి తొలగించారన్న ప్రతీకారంతో ఒక వ్యక్తి ఏం చేశాడంటే?
Viral Post | పగలు ఆటోడ్రైవర్..రాత్రి వేళ ఫైనాన్షియల్ అడ్వైజర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

