Watch: నదిలోకి దూకేందుకు వ్యక్తి యత్నం.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని కాపాడిన పోలీస్
Viral Video | ఒక పోలీస్ ఎంతో ధైర్యం చేశారు. వంతెనపై ఉన్న ఇనుప రాడ్ల రైలింగ్‌ను దాటి మెల్లగా ఆ వ్యక్తి ఉన్న అంచు వద్దకు ఆయన చేరుకున్నారు. నదిలోకి దూకవద్దని నచ్చజెప్పారు. అనంతరం ఆ వ్యక్తిని పైకి లాగి ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు.
గువాహటి: ఒక వ్యక్తి ఆత్మహత్య కోసం నదిలోకి దూకేందుకు ప్రయత్నించాడు. స్పందించిన ఒక పోలీస్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని అతడ్ని కాపాడారు. అస్సాం రాజధాని గువాహటిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో 26 ఏళ్ల వ్యక్తి సరైఘాట్ వంతెన పైకి చేరుకున్నాడు. ఆ బ్రిడ్జి రైలింగ్ అవతల ఉన్న అంచు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నదిలోకి దూకి సూసైడ్ చేసుకోవాలని భావించాడు. దీనిని గమనించిన పలువురు వ్యక్తులు ఆ వంతెనపై పెద్ద సంఖ్యలో గుమిగూడారు. బ్రిడ్జి అంచు వద్ద ఉన్న ఆ వ్యక్తి వద్దకు వెళ్లి అతడ్ని కాపాడేందుకు ఎవరూ సాహసించలేదు.
కాగా, ఈ సమాచారం అందుకున్న జలుక్బరి ఔట్‌పోస్ట్ పోలీసులు ఆ వంతెన వద్దకు చేరుకున్నారు. లంకేశ్వర్ కలిత అనే పోలీస్ ధైర్యం చేశారు. ఇనుప రాడ్ల రైలింగ్‌ను దాటి మెల్లగా ఆ వ్యక్తి ఉన్న అంచు వద్దకు ఆయన చేరుకున్నారు. నదిలోకి దూకవద్దని నచ్చజెప్పారు. అనంతరం ఆ వ్యక్తిని పైకి లాగి ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు.
మరోవైపు తన ప్రాణాలు లెక్కచేయక ధైర్యంతో వ్యక్తిని కాపాడిన పోలీస్ లంకేశ్వర్ను ఉన్నతాధికారులు ప్రశంసించారు. డ్యూటీ పట్ల ఆయన అంకిత భావానికిగాను రూ.10,000 నగదు అవార్డును ప్రకటించారు. అయితే సూసైడ్‌కు యత్నించిన వ్యక్తిని పోలీస్ కాపాడిన సంఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు కూడా ఆ పోలీస్ ధైర్య సాహసాలను కొనియాడారు.
Video: Assam Cop Rescues 26-Year-Old From Suicide Attempt On River Bridge
Read here: https://t.co/Fe7udQdlmX pic.twitter.com/nQ6KFjMZhf
— NDTV Videos (@ndtvvideos) April 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

