పట్టపగలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంటి దగ్గరే బ్యాంకులో రూ.కోటి చోరీ

హజీపూర్: పట్టపగలే ఐదుగురు దుండగులు ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో చొరబడి, సిబ్బందిని బెదిరించి రూ.1.19 కోట్లతో ఉడాయించారు. బీహార్‌లోని హజీపూర్‌లో ఈ ఘటన జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇంటి సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బ్యాంకు తెరవగానే ఐదుగురు వ్యక్తులు బైకులపై వచ్చి లోనికి చొరబడ్డారు. నేరుగా క్యాష్ రూమ్‌లోకి వెళ్లి బ్యాగుల్లో రూ.1.19 కోట్లు నింపుకొని పరారయ్యారు.
అయితే చోరీకి పాల్పడిన వాళ్లు సీసీటీవీ కెమెరాలకు చిక్కారని పోలీసులు తెలిపారు. వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. ఇప్పటికే అన్ని సరిహద్దులూ మూసివేసినట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. గత వారం ఇలాగే ముజఫర్‌నగర్‌లో ఇద్దరు వ్యాక్తులు ఆయుధాలతో వచ్చి బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

