Wild Animals | భువనేశ్వర్: అనుమతి లేకుండా వన్య ప్రాణుల ఫొటోలు కానీ, సెల్ఫీలు కానీ తీస్తున్నారా? ఏడేండ్ల జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ శాఖాధికారులు. జంతువులతో ఫొటోలు ముఖ్యంగా సెల్ఫీల కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత్ నందా ఆదేశాలు జారీ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారని, జంతువుల సహజ ప్రవర్తన, వాటి నివాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, అంతేకాకుండా ఇది 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమేనని అన్నారు.