పండగ సీజన్లో పాల ధరల భారం : లీటర్‌కు రూ 2 పెంచిన అమూల్
పండగ సీజన్లో వినియోగదారులపై భారం మోపేలా అమూల్ పాల ధరలు పెరిగాయి.
అహ్మదాబాద్ : పండగ సీజన్లో వినియోగదారులపై భారం మోపేలా అమూల్ పాల ధరలు పెరిగాయి. అమూల్ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్న గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లీటర్ పాలను రూ 2 పెంచింది. తాజా పెంపుతో ఫుల్ క్రీం మిల్క్ లీటర్‌కు రూ 61 నుంచి రూ 63కు చేరింది.
అమూల్ పాల ధరలు పెరగడంతో వంటింటి బడ్జెట్ మరింత భారం కానుంది. ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో అమూల్ పాల ధరలను పెంచకపోవడం గమనార్హం. గుజరాత్ మినహా ఇతర రాష్ట్రాలన్నింటిలో ఫుల్ క్రీం పాలు, గేదె పాలను అమూల్ లీటర్‌కు రూ 2 పెంచిందని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ ఆర్ఎస్ సోధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
డైరీ ఫ్యాట్ ధరలు పెరగడంతో గోల్డ్, బఫెలో మిల్క్ ధరలను లీటర్‌కు రూ 2 చొప్పున పెంచినట్టు ఆయన వివరించారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కూడా అమూల్ గోల్డ్, శక్తి, తాజా మిల్క్ బ్రాండ్ల ధరను లీటర్‌కు రూ 2 చొప్పున పెంచింది. ఇక లంఫీ వైరస్తోనూ ఉత్తరాది రాష్ట్రాల్లో పాల తయారీ, సరఫరా వ్యవస్ధలపై పెను ప్రభావం చూపింది. ఈ వ్యాధితో ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు లక్ష పశువులు మరణించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

