Amul Milk | పాల ధరలను మరోసారి పెంచిన అమూల్ సంస్థ
దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది.
Amul Milk | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. తాజా పెంపుతో.. అమూల్ గోల్డ్ పాలు లీటరు రూ. 66, అమూల్ తాజా పాలు లీటరు రూ.54, అమూల్ ఆవు పాలు లీటరుపై రూ.56 చెల్లించాల్సి ఉంటుంది. ఇక అమూల్ ఏ2 గేదె పాల ధర లీటరు రూ.70కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.

శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల ధరల జాబితాను గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేల్స్ సీనియర్ మేనేజర్ ప్రకాష్ ఔటే విడుదల చేశారు. కాగా, గతంలో అమూల్ 2022లో పాల ధరను మూడుసార్లు పెంచిన విషయం తెలిసిందే. గతేడాది మార్చి, ఆగస్టు, అక్టోబర్లలో పాలధరను పెంచింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా పాల ధరను పెంచినట్లు కంపెనీ తెలిపింది. గతంలో సాధారణంగా లీటరుకు రూ.2 పెంచగా.. ఈసారి ఏకంగా మూడు రూపాయలు పెంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

