‘తౌక్టే’ బీభత్సం.. పలు రాష్ట్రాల సీఎంతో మాట్లాడిన అమిత్ షా
‘తౌక్టే’ బీభత్సం | తౌక్టే తుఫాన్ ధాటికి పశ్చిమతీర రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

న్యూఢిల్లీ : తౌక్టే తుఫాన్ ధాటికి పశ్చిమతీర రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తున్నది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
చిగురుటాకులా వణుకుతున్న గుజరాత్..
తౌక్టే తుఫాన్ బీభత్సానికి గుజరాత్ చిగురుటాకులా వణికిపోతున్నది. తీరప్రాంతాలు భారీగా కోతకు గురయ్యాయి. మరో 3 గంటల్లో గుజరాత్‌లోని సురేంద్రనగర్- అమ్రేలీ మధ్య తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో పశ్చిమతీరం లోతట్టు ప్రాంతాల్లోని వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీర ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాల్లోని చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

