American Woman | పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమెరికా వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి
American Woman | పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఒక వ్యక్తి, అమెరికా వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది.
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఒక వ్యక్తి, అమెరికా వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. అమెరికాకు చెందిన 62 ఏళ్ల మహిళ (American Woman) 2017లో తొలిసారి భారత్ సందర్శనకు వచ్చింది. ఆ సమయంలో ఆగ్రాకు చెందిన 32 ఏళ్ల గగన్‌దీప్ ఇంట్లో బస చేసింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. దీంతో గత కొన్నేళ్లుగా ఆ మహిళ తరచుగా అమెరికా నుంచి భారత్‌కు వస్తున్నది. గగన్‌దీప్ ఆమెను పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లాడు. వారి మధ్య పరిచయం బలపడటంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుమార్లు ఆమెతో లైంగిక చర్యలో పాల్గొన్నాడు.
కాగా, గగన్‌దీప్ తనను మోసగించినట్లు అమెరికా మహిళ గ్రహించింది. అలాగే విషం ఇచ్చి తనను చంపేందుకు అతడు ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపారు. అమెరికా మహిళ చేసిన ఆరోపణలు వాస్తమేనని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 6న ఆగ్రాలో ఉన్న గగన్‌దీప్‌ను అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agra man
- American Woman
- arrest
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

