పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ రాజీనామా..

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకున్నది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తన పదవి రాజీనామా చేశారు. కాసేపటి క్రితం ఆయన పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ను కలిశారు. తనతో పాటు తన మంత్రిమండలి రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం మీడియా అడ్వైజర్ రవీణ్ తుక్రాల్ తెలిపారు. తన తండ్రి కెప్టెన్ అమరీందర్ రాజీనామా చేయనున్నట్లు ఆయన కుమారుడు రణిందర్ సింగ్ కొన్ని గంటల ముందు తన ట్విట్టర్లో వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీరియస్‌గా ఉన్న కెప్టెన్ అమరీందర్ తన సీఎం పదవికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసిందే. ఇలాంటి అవమానాలతో పార్టీలో కొనసాగలేనని సోనియా గాంధీతో ఆయన చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించేందుకు పార్టీ సమాయత్తమైన వేళ కెప్టెన్ అమరీందర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నివాసం ముందు అమరీందర్ మీడియాతో మాట్లాడారు. మూడవ సారి తనను అవమానించినట్లు ఆయన అన్నారు. రాజీనామా చేయాలని ఇవాళ ఉదయమే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ చీఫ్‌కు తన నిర్ణయాన్ని చెప్పినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

