అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి

అలహాబాద్, సెప్టెంబర్ 20: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి (72) అనుమానాస్పద స్థితిలో మరణించారు. అలహాబాద్‌లోని బాఘంబరీ మఠంలోని తన నివాసంలో ఉరి వేసుకున్నట్టున్న స్థితిలో ఆయన మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. తన శిష్యుడైన ఆనంద్ గిరి తనను మానసికంగా వేధించాడని ఆ నోట్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు, ఆనంద గిరితో పాటు సూసైడ్ నోట్లో పేర్లు ఉన్న వ్యక్తులు ఆద్య తివారీ, అతని కుమారుడు సందీప్ తివారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆనంద్ గిరి ఖండించారు. ‘ఇది ఏడాదికి పైగా జరుగుతున్న కుట్ర. మొదట గురూజీని నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు ఆయనను హత్య చేశారు. ఈ కుట్రలో పోలీ సులు, ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది’ అని ఆరోపించారు. మఠం భూమి అమ్మకంపై గతంలో తనకు, గురూజీకి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, మేలో అవి పరిష్కారమయ్యాయని చెప్పారు. అఖాడా పరిషత్ దేశంలో అతిపెద్ద సాధువుల సంస్థ. నరేంద్రగిరి మృతిపట్ల ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

