Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లుగా బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ఏఐ వీడియో సృష్టించాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
బెంగళూరు: అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లుగా బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ఏఐ వీడియో సృష్టించాడు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Bihar Man Arrested) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బీహార్‌కు చెందిన 25 ఏళ్ల హజ్రత్ అలీ గత కొన్ని నెలలుగా బెంగళూరులో రోజువారీ వేతనంతో పైప్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఏఐ వీడియోను అతడు పోస్ట్ చేశాడు. కర్ణాటక శాసనసభ కొలువుదీరే అత్యంత భద్రత కలిగిన బెంగళూరులోని విధానసౌధను బాంబుతో పేల్చివేస్తున్నట్లుగా ఏఐ వీడియోను అతడు సృష్టించాడు. అంతేకాకుండా ఆ భవనాన్ని తానే పేల్చివేసినట్లు ఆ వీడియోలో అతడు పేర్కొన్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పలువురు నెటిజన్లు బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాను పోలీసులు డీయాక్టివేట్ చేశారు. బీహార్‌కు చెందిన వలస కార్మికుడైన హజ్రత్ అలీని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. భయపెట్టే లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను సృష్టించి, ప్రచారం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

