కరోనాతో ఆక్సిజన్ అందక భార్య మృతి.. జ్ఞాపకార్థం 450 మొక్కలు నాటిన భర్త
చెట్లు | కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడిన విషయం విదితమే. ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది

అహ్మదాబాద్ : కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడిన విషయం విదితమే. ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ కూడా కరోనా బారిన పడి, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయింది. తన భార్య ఆక్సిజన్ కొరతతో చనిపోవడంతో.. భర్త ఓ నిర్ణయానికి వచ్చాడు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించాలనే ఉద్దేశంతో భారీగా మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన 15 ఏండ్ల కుమారుడు పూర్వతో కలిసి తండ్రి ధ్రువాల్ పటేల్ 450 మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచాడు.
ఈ సందర్భంగా ధ్రువాల్ పటేల్ మాట్లాడుతూ.. తన భార్య నేహా అంత్యక్రియలు సిద్ధ్‌పూర్‌లో నిర్వహించామని, అక్కడ ఓ పూజారి కనీసం 3 మొక్కలు నాటాలని చెప్పాడు. అంత్యక్రియలకు మనం ఉపయోగిస్తున్న కలప వేరొకరు ఇస్తున్న బహుమతి అని పూజారి చెప్పినట్లు పటేల్ తెలిపాడు. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో పాటు కలప కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పూజారి చెప్పిన విధంగా మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ తీసుకున్నానని పటేల్ తెలిపాడు.
కరోనా సెకండ్ వేవ్‌లో పటేల్ నివాసంలో ఐదుగురిలో నలుగురికి కరోనా సోకింది. ధ్రువాల్, నేహాతో పాటు కుమారుడు, తండ్రి కరోనా బారిన పడ్డారు. కానీ నేహా ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానని, 17 ఏండ్ల అన్యోన్య దాంపత్య జీవితంలో నేహాను విడిచి ఉండలేదని పటేల్ తెలిపాడు. ధ్రువాల్, నేహాకు 2004లో వివాహమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

