Watch: మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోయిన మరో బీజేపీ నేత… మాజీ జవాన్‌పై దాడి
భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మరో బీజేపీ నేత రెచ్చిపోయాడు. స్నేహితుడితో కలిసి మాజీ జవాన్‌పై దాడి చేశాడు. మహిళపై దాడి చేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఘటన మరువక ముందే ఆ పార్టీ మరో నేత అదే తరహా దౌర్జన్యం, దాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో సోమవారం ఈ సంఘటన జరిగింది. మాజీ సైనికుడు దినేష్ మిశ్రా ఒక సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. బీజేపీ యూత్ లీడర్ రితురాజ్ చతుర్వేది, తన స్నేహితుడితో కలిసి బలవంతంగా ఆ షాపులోకి వచ్చాడు. దినేష్ మిశ్రాను దారుణంగా కొట్టాడు. అక్కడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు లూఠీ చేశాడు.
ఈ సంఘటన అనంతరం బాధితుడైన దినేష్ మిశ్రా దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Gangism of BJP leaders..
👉 Yesterday Srikanth Tyagi
👉 Today BJP Yuva Morcha city President Rituraj Chaturvedi along with his colleagues beat up a retired soldier and robbed a saloon in Rewa, Madhya Pradesh today.#ShameOnBJP @KTRTRS pic.twitter.com/bDKms4WnEF— Jagan Patimeedi (@JAGANBRS) August 9, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

