Mayavati | మాయావతి ఆదేశం.. రాజకీయాల నుంచి తప్పుకున్న సీనియర్ నేత..!
Mayavati | బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదేశాలతో ఆ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన అల్లుడు, మాయావతి మేనల్లుడు అయిన ఆకాశ్ ఆనంద్‌కు పార్టీలో మళ్లీ అవకాశం ఇవ్వాలంటే సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని మాయావతి షరతు పెట్టిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Mayavati : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదేశాలతో ఆ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన అల్లుడు, మాయావతి మేనల్లుడు అయిన ఆకాశ్ ఆనంద్‌కు పార్టీలో మళ్లీ అవకాశం ఇవ్వాలంటే సిద్ధార్థ్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని మాయావతి షరతు పెట్టిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
గురువారం సోషల్ మీడియా వేదికగా అశోక్ సిద్ధార్థ్ ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆగస్టు 2న రెండోసారి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన, తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. మాయావతిని తన “రాజకీయ గురువు, అక్క” అని సంబోధిస్తూ.. బీఎస్పీకి తన విధేయతను పునరుద్ఘాటించారు. “ప్రపంచంలో మరేదానికన్నా మీ ఆదేశమే నాకు ముఖ్యం. మీ ఆజ్ఞల ముందు నా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబం కూడా చిన్నవే” అని ఆయన పేర్కొన్నారు.
గత 35 ఏళ్లుగా బీఎస్పీకి అంకితభావంతో పనిచేస్తున్నానని సిద్ధార్థ్ తెలిపారు. “సాధారణ కార్యకర్తనైన నాకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. మీ కుటుంబంలో ఒకడిగా నన్ను భావించారు. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. గౌతమ బుద్ధుడు, కాన్షీరాం సాక్షిగా చెబుతున్నా పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ పనిచేయలేదని ఆయన స్పష్టంచేశారు. ఆకాశ్ ఆనంద్‌ను తప్పుదోవ పట్టించారని, పార్టీని నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించారని తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.
“గత కొన్ని నెలల్లో నేను ఆకాశ్ ఆనంద్‌ను కలిసింది చాలా తక్కువసార్లు. అది కూడా ఎన్నికల రాష్ట్రాల్లో మీరు నాకు అప్పగించిన బాధ్యతల నేపథ్యంలోనే. సంస్థలో నాకు లభించిన గౌరవాన్ని చూసి అసూయపడిన కొందరు సహచరులే నాపై కుట్ర చేసి తప్పుడు ఆరోపణలు చేశారు” అని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తంచేశారు. తన రిటైర్మెంట్ను కేవలం ఆకాశ్ ఆనంద్ పునరాగమనంతో ముడిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. “బహుజన ఉద్యమానికి నా రాజకీయ జీవితం అడ్డంకిగా ఉందని మీరు భావిస్తే, ఈ క్షణం నుంచే నేను రాజకీయ, సామాజిక జీవితం నుంచి విరమించుకుంటున్నా అని” అని పేర్కొన్నారు.
“నా జీవితం మీకు రుణపడి ఉంది. దానితో పోలిస్తే ఈ పదవీ విరమణ చాలా చిన్నది. మీ కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా అది నా అదృష్టంగా భావిస్తాన” అని సిద్ధార్థ్ తన లేఖను ముగించారు. అంతకుముందు రోజు మాయావతి మాట్లాడుతూ.. అశోక్ సిద్ధార్థ్ తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగితేనే, ఆయన అల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు పార్టీలో బాధ్యతలు అప్పగించే విషయంపై సానుభూతితో పరిశీలిస్తామని స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

