Chennai-Colombo flight searched | విమానంలో ఉగ్రవాదులున్నట్లు ఈమెయిల్.. శ్రీలంకలో తనిఖీ
Chennai-Colombo flight searched | తమిళనాడులోని చెన్నై నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయలుదేరిన ఆ దేశ విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులున్నట్లు ఈమెయిల్ అందింది. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలంకను అలెర్ట్ చేశారు.
చెన్నై: తమిళనాడులోని చెన్నై నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయలుదేరిన ఆ దేశ విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులున్నట్లు ఈమెయిల్ అందింది. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలంకను అలెర్ట్ చేశారు. ఈనేపథ్యంలో కొలంబో చేరుకున్న ఆ దేశ విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. (Chennai-Colombo flight searched) శనివారం ఉదయం 11.05 గంటలకు చెన్నై ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఒక ఈమెయిల్ అందింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లే శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు అందులో ఉంది. ‘ఆ విమానంలో ఉన్న ఐదుగురు దక్షిణ భారతీయులైన పురుషులు లష్కరే కార్యకర్తలు. క్లీన్ ప్రొఫైల్, బాగా శిక్షణ పొందినవారు, ఎలాంటి అనుమానం లేదు’ అని ఈమెయిల్లో పేర్కొన్నారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. నిఘా వర్గాల సమాచారంగా భావించారు. శ్రీలంకన్ విమానం అప్పటికే చెన్నై నుంచి బయలుదేరడంతో కొలంబో ఎయిర్‌పోర్ట్‌కు ఈ సమాచారం అందించి అలెర్ట్ చేశారు. దీంతో అక్కడ ల్యాండైన ఆ విమానంలోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను గుర్తించలేదని శ్రీలంక తెలిపింది. ఈ నేపథ్యంలో బెదిరింపు ఈమెయిల్‌గా దీనిని పరిగణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

