భోపాల్: బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. (Girl Raped) ఈ నేపథ్యంలో ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అదృశ్యమైన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి బాలిక తల్లిదండ్రులు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందును ఆ బాలిక తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
కాగా, బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను దామోహ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ బాలికపై లైంగికదాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పురుగుల మందు తాగడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వెల్లడించారు. పోలీసులకు ఈ సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదృశ్యమైన నిందితుడి కోసం వెతుకుతున్నారు.