Calcutta High Court: అమ్మాయిలు లైంగిక కోర్కెలను నియంత్రించుకోవాలి: కల్కత్తా హైకోర్టు
Calcutta High Court: కౌమారదశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని కల్కత్తా హైకోర్టు తెలిపింది. కౌమారదశలో ఉన్న అబ్బాయిలు కూడా అమ్మాయిలు, మహిళల పట్ల హుందాగా వ్యవహరించాలని, వారి శరీర సౌష్టవాన్ని గౌరవించాలని హైకోర్టు అభిప్రాయపడింది.
కోల్‌కతా: రెండు నిమిషాల సుఖానికి ప్రాధాన్యం ఇవ్వడం కన్నా.. కౌమారదశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని కల్కత్తా హైకోర్టు(Calcutta High Court) తెలిపింది. కౌమారదశలో ఉన్న అబ్బాయిలు కూడా అమ్మాయిలు, మహిళల పట్ల హుందాగా వ్యవహరించాలని, వారి శరీర సౌష్టవాన్ని గౌరవించాలని హైకోర్టు అభిప్రాయపడింది. మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఓ యువకుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. జస్టిస్ చిట్టా రంజన్ దాస్, పార్దసారధి సేన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
16 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు ఒకవేళ ఇష్టపూర్వకంగా లైంగిక చర్యలో పాల్గొంటే ఆ కేసులను నేరరహితం చేయాలని కోర్టు తెలిపింది. యవ్వన దశలో లైంగిక సంబంధాల ద్వారా కలిగే న్యాయపరమైన చిక్కులపై అవగాహన కల్పించేందుకు సమగ్రమైన లైంగిక విద్యను అందించాలని కోర్టు అభిప్రాయపడింది. లైంగికపరమైన కోర్కెలు, వాంఛాలకు చెందిన కారణాలను కోర్టు తన తీర్పులో సవివరంగా వెల్లడించింది.
లైంగిక వాంఛలు కలడానికి మన శరీరంలోని పిట్యుటరీ గ్రంధి కీలకమైందని, అది టెస్టెస్టరోన్ లాంటి లైంగిక హార్మోన్లను రిలీజ్ చేస్తుందని, ఆ గ్రంధిని అదుపులో పెట్టడం మన చేతుల్లో ఉందని, ఆ గ్రంధి ఆటోమెటిక్‌గా హార్మోన్లను రిలీజ్ చేయదు అని, చూడడం, వినడం, చదవడం వంటి చర్యలతో మనలో లైంగిక తృష్ణ కలుగుతుందని కోర్టు తెలిపింది. అంటే మన స్వంత చర్యల వల్లే మనలో కోర్కెలు కలుగుతున్నాయని, అందుకే ఆ కోర్కెలను అదుపులో పెట్టుకోవాలని కోల్‌కతా హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. యవ్వన దశలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండాలన్న సూత్రాలను కూడా కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

