Mushtaq Khan Kidnapped: సత్కరిస్తామని ఆహ్వానించి.. స్త్రీ-2 నటుడు కిడ్నాప్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
Mushtaq Khan kidnapped: బాలీవుడు నటుడు ముస్తాక్ ఖాన్ను కిడ్నాప్ చేసి.. అతని వద్ద నుంచి రెండు లక్షలు కాజేశారు. అవార్డు ఫంక్షన్కు రావాలంటూ విమాన టికెట్లు ఇప్పించి, కొంత అమౌంట్ కూడా ట్రాన్సఫర్ చేశారు కిడ్నాపర్లు. ఇక నటుడు ఢిల్లీ వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది.
న్యూఢిల్లీ: బాలీవుడు నటుడు ముస్తాక్ ఖాన్(Mushtaq Khan kidnapped)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. అతని వద్ద నుంచి రెండు లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెల్కమ్, స్త్రీ2 చిత్రాల్లో నటించిన ముస్తాక్ ఖాన్కు మంచి గుర్తింపు ఉన్నది. అయితే మీరట్లో నిర్వహించే ఈవెంట్కు హాజరుకావాలంటూ ముస్తాక్ ఖాన్కు ఆహ్వానం అందింది. ఢిల్లీ వరకు ఫ్లయిట్ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పారు. దీనిలో భాగంగా అతని అకౌంట్లో కొంత పేమెంట్ చేశారు. నవంబర్ 20వ తేదీన మీరట్లో జరిగే అవార్డు ఫంక్షన్కు ఆహ్వానిస్తున్నామని చెప్పి .. నటుడు ముస్తాక్ను ఢిల్లీకి రప్పించారు.
ఢిల్లీలో ముస్తాక్ ఖాన్ విమానం దిగిన తర్వాత సీన్ మారింది. ఓ వాహనంలో నటుడిని తీసుకుని కొంత దూరం వెళ్లారు. అక్కడ మరో వాహనంలోకి ఎక్కించారు. ఆ తర్వాత 12 గంటల పాటు కిడ్నాపర్లు అతన్ని బంధించారు. కోటి ఇవ్వాలంటూ కిడ్నాపర్లు చిత్రహింస పెట్టారు. కానీ ఖాన్, అతని కుమారుడి అకౌంట్ల నుంచి కేవలం రెండు లక్షలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది.
కిడ్నాపర్ల వద్ద ఉన్న సమయంలో.. మసీదు అజా విన్న అతను అక్కడికి పారిపోయాడు. ఆ తర్వాత స్థానికులకు తన పరిస్థితి చెప్పి సాయం కోరాడు. పోలీసుల సహాయంతో అతను స్వంత ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ముస్తాక్ ఖాన్ క్షేమంగా ఉన్నారు. ఆ ఘటన పట్ల త్వరలో ఆయన మీడియాకు వివరించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

