Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
Abhijeet Dipke | దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌కు ఆ హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. ఇప్పుడు దేశమంతా ‘జంతర్ మంతర్’ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌కు ఆ హోదాను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. ఇప్పుడు దేశమంతా ‘జంతర్ మంతర్’ అవుతుందని ఆయన పేర్కొన్నారు. (Abhijeet Dipke) సోమవారం ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘వారు (కేంద్రం) జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలం జాబితా నుంచి తొలగించారు. అవును, అది ఇకపై నిరసన స్థలం కాదు. ఏదేమైనా ఒక పిరికి నియంత దానిని యుద్ధ క్షేత్రంగా మార్చేశారు. ఇక దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’ అని అందులో పేర్కొన్నారు. అలాగే, ఈ రోజు జంతర్ మంతర్‌కు ఉన్న ‘నిరసన ప్రదేశం’ హోదాను ప్రధాని మోదీ రద్దు చేశారని, రేపు ఆయన ప్రజాస్వామ్యాన్నే రద్దు చేస్తారని మరో పోస్ట్‌లో మండిపడ్డారు. ‘ఆ నియంతకు అసలు సమస్య నిరసన ప్రదేశం కాదు. ప్రజలు నిరసన తెలపడం అనే భావనే ఆయనకు సమస్య’ అని విమర్శించారు.
కాగా, జంతర్ మంతర్‌ను నిరసనలకు నిర్దేశిత ప్రదేశంగా గుర్తించే హోదాను రద్దు చేస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘కమిటీ సిఫార్సుల ఆధారంగా, నిరసన వేదికగా జంతర్ మంతర్‌కు ఉన్న గుర్తింపును రద్దు చేశారు. నిరసనలు లేదా ప్రదర్శనలు నిర్వహించడానికి రామ్‌లీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ మైదానం అనే మూడు కొత్త ప్రదేశాలను నిర్దేశించారు’ అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మూడు కొత్త ప్రదేశాలలో నిరసనలు నిర్వహించడానికి సంబంధించిన ప్రామాణిక కార్యనిర్వహణ విధానాలను వేర్వేరుగా జారీ చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరోవైపు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్) వివాదంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షాలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలను ఉధృతం చేశాయి. దీంతో గత రెండు రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడకు చేరుకుంటున్న నిరసకారులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌కు ఆ గుర్తింపును రద్దు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
They have removed Jantar Mantar as a designated protest site.
Yes, it’s no a longer protest site as anyway it was turned into a war zone by the coward dictator.
Ab poora desh Jantar Mantar banega!
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 12, 2026
Today, Modi denotified Jantar Mantar as a designated protest site.
Tomorrow, he will denotify democracy itself.
The dictator’s problem was never the protest site. It was the very idea of people protesting.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

