Viral Video | ఈ దేశీ టెక్నిక్‌తో నిమిషాల్లో గోడ కట్టేశారు..!
కాయకష్టంతో చేసే పనులను అవలీలగా చేసేందుకు యంత్రాలతో పనిలేకుండా కొందరు వినూత్న మార్గాలతో చక్కబెడుతున్నారు. అవసరంతోనే ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయనేందుకు లేటెస్ట్ వీడియో (Viral Video) నిదర్శనంగా నిలుస్తోంది.
న్యూఢిల్లీ : కాయకష్టంతో చేసే పనులను అవలీలగా చేసేందుకు యంత్రాలతో పనిలేకుండా కొందరు వినూత్న మార్గాలతో చక్కబెడుతున్నారు. అవసరంతోనే ఆవిష్కరణలు పురుడు పోసుకుంటాయనేందుకు లేటెస్ట్ వీడియో (Viral Video) నిదర్శనంగా నిలుస్తోంది. సాధారణ వస్తువులతోనే అద్భుతమైన యంత్రాలను తయారుచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తుంటాయి.
ఇక తాజా వీడియోను తన్సు యెజెన్ ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మెరుగైన స్పందన లభించింది. ఈ వీడియోలో కొందరు నిర్మాణ రంగ కార్మికులు దేశీ యంత్రంతో అవలీలగా నిర్మాణ పనులను చేపట్టడం కనిపిస్తుంది. ఈ క్లిప్‌లో ఇద్దరు కార్మికులు చెక్క బల్లల చివరన కూర్చుండటం కనిపిస్తుంది.
Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55
— Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023
ఈ బల్ల వెనుక ఇద్దరు వ్యక్తులు నిలుచుని లిఫ్ట్ చేస్తుండగా ఓ వ్యక్తి ఇటుకను మరో వ్యక్తికి అందించడం ఆపై అతడు దాన్ని వేగంగా అందుకుని గోడపై ఉంచడం చూడొచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 19 లక్షలు పైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. దేశీ టెక్నిక్‌లు ఇలాగే ఉంటాయని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.
Read More :
Tomato Price | రూ.160 దాటిన కిలో టమాట ధర.. గంగోత్రి ధామ్‌లో అయితే..
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- construction
- Viral video
- wall
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

