Char Dham Yatra | చార్ధామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్..గంటల తరబడి కదలని వాహనాలు
Char Dham Yatra | ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు(Char Dham Yatra )భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు(Char Dham Yatra )భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్(Traffic jam) కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్ ఘాట్స్ సమీపంలోని బద్రీనాథ్ మార్గం అలాగే కేదార్‌నాథ్‌కు దారితీసే సోన్ ప్రయాగ్ వంటి కీలక మార్గాల్లో త్రీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది.
ముఖ్యంగా జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వరకు 25 నుండి 30 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో యాత్రికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. సరైన ఆహారం, నీళ్లు లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.
యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ వివరాలను తెలుసుకొని అంతుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. కాగా, యాత్రికులకు మార్గమధ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, యాత్రా మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

