Cement Drum Murder Plan | సిమెంట్, బ్లూ డ్రమ్ము సిద్ధం చేశా.. నీదే ఆలస్యం.. మెసేజ్ చూసి భార్యను ప్రియుడి వద్దకు పంపిన భర్త!
Cement Drum Murder Plan | సిమెంట్, బ్లూ డ్రమ్ము సిద్ధం చేశా.. నీదే ఆలస్యమంటూ ప్రియుడికి ఓ భార్య పంపిన మెసేజ్ చేసి భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. భార్య మెసేజ్‌తో భయపడిపోయి ఆమెను తన ప్రియుడితో పంపించేశాడు. యూపీలోని బులంద్‌షహర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Cement Drum Murder Plan | సిమెంట్, బ్లూ డ్రమ్ము సిద్ధం చేశా.. నీదే ఆలస్యమంటూ ప్రియుడికి ఓ భార్య పంపిన మెసేజ్ చేసి భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పరువు కోసం పాకులాడి తన భార్యను ఇంట్లో ఉంచుకోవడం కంటే.. ప్రియుడితో పంపించి ప్రాణాలు కాపాడుకోవడం బెటర్ అనుకున్నాడు. వెంటనే భార్యను ఆమె ప్రియుడితో పంపించేశాడు. యూపీలోని బులంద్‌షహర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. బులంద్‌షహర్‌లో నివాసం ఉంటున్న రాజ్‌కుమార్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. వారికి ఆరు నెలల కొడుకు ఉన్నాడు. అయినప్పటికీ సదరు మహిళ తన ప్రియుడితో రిలేషన్లో ఉండటాన్ని ఇటీవల రాజ్‌కుమార్ గుర్తించారు. తన ప్రియుడితో భార్య ఫోన్లో మాట్లాడుతుండటం గమనించి ఆమెను నిలదీశాడు. అప్పుడు భార్య తనకు ప్రియుడితో ఉండటమే ఇష్టమని.. అతనితో వెళ్లిపోతానని తెగేసిచెప్పింది.
ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన భర్త.. భార్య ఫోన్ లాక్కొని మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో ప్రియుడికి నగ్న ఫొటోలు పంపించినట్లు గుర్తించాడు. అంతేకాదు సిమెంట్, డ్రమ్ము సిద్ధం చేశా.. నీదే ఆలస్యమంటూ ప్రియుడికి పెట్టిన మెసేజ్ కూడా చూసి హడలిపోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
జరిగినదంతా తెలుసుకున్న పోలీసులు ఏం చేద్దామని అనుకుంటున్నావని రాజ్కుమార్నే ప్రశ్నించారు. అప్పుడు బయపడిపోయిన రాజ్‌కుమార్ తనకు ఇంకొన్ని రోజులు బతకాలని ఉందని సమాధానమిచ్చాడు. ఈమెతో కాపురం చేసి డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా మారే బదులు.. ఆమెను ప్రియుడితో పంపించేయడమే మేలని తన ఆలోచనను వివరించాడు. ఈ మేరకు భార్యను ప్రియుడికి అప్పగించి, ప్రాణాలతో బయటపడ్డా బతుకుజీవుడా అంటూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

