Rajiv Assassination Case | వెల్లూర్ జైలు నుంచి నళిని శ్రీహరన్ విడుదల
Rajiv Assassination Case | మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ అలియాస్ నళిని మురుగన్
వెల్లూర్: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ అలియాస్ నళిని మురుగన్ వెల్లూర్ జైలు నుంచి విడుదలయ్యింది. అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన తర్వాత ఈ సాయంత్రం జైలు అధికారులు నళినిని విడుదల చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్ పయస్, రవిచంద్రన్, శ్రీహరన్, జయకుమార్, శంతనును విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నళిని, రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ పూర్తిచేసిన తర్వాత కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్ హత్య కేసులో నళిని, శ్రీహరన్ అలియాస్ మురుగన్, శంతను, ఏజీ పెరారివాళన్, జయకుమార్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. గత మే 18న పెరారివాళన్ పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.
ఈ క్రమంలో నళిని, రవిచంద్రన్‌ల పిటిషన్‌పై విచారణ అనంతరం వారి విడుదలకు ఇచ్చిన తీర్పే ఆరుగురికి వర్తిస్తుందని కోర్టు స్పష్టంచేసింది. జైలులో నిందితుల ప్రవర్తన సరిగా ఉండటంతో విడుదల చేయాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా 1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణించారు. ఆయనతోపాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

