డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ పూర్తి చేసి శనివారం తుది ఓటర్ల్ల జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 8 లక్షలు తగ్గింది. ‘సర్’ ప్రక్రియకు ముందు ఆ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 71.58 లక్షలు ఉండేది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనోజ్ రావత్ మాట్లాడుతూ మొత్తం 14 లక్షల ఓట్లు తగ్గాయని ఆరోపించారు.
2025 జనవరి 1 నాటికి ‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు 85.19 లక్షల ఓట్లు ఉంటే.. ఇప్పుడు 71.58 లక్షలకు తగ్గాయని చెప్పారు. అయితే ఉత్తరాఖండ్ ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకారం జూన్ 8న ‘సర్’ ప్రారంభం అయినప్పుడు 79.6 లక్షల ఓట్లు ఉండేవి. తుది ఓటర్ల జాబితా మీద వివాదం రాజుకుంటున్నది.