Massive Fire | టెక్స్టైల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. యజమాని సహా ఎనిమిది మంది సజీవదహనం
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. షోలాపూర్‌లో ఎండీఐసీలోని (Solapur MIDC) సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్‌లో తెల్లవారుజామున 3.45 గంటలకు ఒక్కసారిగా మంటలు చెరలేగాయి
ముంబై: మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. షోలాపూర్‌లో ఎండీఐసీలోని (Solapur MIDC) సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్‌లో తెల్లవారుజామున 3.45 గంటలకు ఒక్కసారిగా మంటలు చెరలేగాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తం విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సుమారు ఆరు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలిపారు.
మంటల్లో ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు. వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని వెల్లడించారు. మృతుల్లో ఫ్యాక్టరీ యజమానితోపాటు, అతని ఏడాదిన్నర వయస్సు కలిగిన మనవడు, ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామన్నారు. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో మంటలను అదుపుచేయడానికి 5 నుంచి 6 గంటలపాటు శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

