H3N2 Virus | పెరుగుతున్న ఇన్ఫ్లూయెంజా కేసులు.. హెచ్3ఎన్2తో ఆరుగురు మృతి
H3N2 Virus | దేశంలో ఇన్ఫ్లూయెంజా కేసుల వ్యాప్తి కలవరపెడుతున్నది. హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించాయని తాజాగా వస్తున్న వార్తలు భయాందోళన రేపుతున్నది.
H3N2 Virus | న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలో ఇన్ఫ్లూయెంజా కేసుల వ్యాప్తి కలవరపెడుతున్నది. హెచ్3ఎన్2 వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించాయని తాజాగా వస్తున్న వార్తలు భయాందోళన రేపుతున్నది. ఇన్ఫ్లూయెంజాతో దేశంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక హెచ్3ఎన్2 మరణాన్ని అధికారులు ధ్రువీకరించగా.. పంజాబ్, హర్యానాల్లో కూడా మరణాలు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో హెచ్3ఎన్2 కారణంగా ఈనెల 1న మరణించిన వ్యక్తిని హీరె గౌడ(82)గా అధికారులు గుర్తించారు. మరణాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇన్ఫ్లుయెంజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపింది. పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో తాజాగా 440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,294కు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fever
- H3N2 Virus
- Health
- Influenza
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

