Mallikarjun Kharge | ఖర్గే ట్రస్టుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ భూసంతర్పణ..
ముడా, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌లు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్‌ను కుదిపేస్తుండగా.. మరో సంచలన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ‘సిద్ధార్థ విహార ట్రస్టు’కు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూమి కేటాయించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
- కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి సంస్థకు అక్రమ లబ్ధి
- బెంగళూరు హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్కులో 5 ఎకరాలు కట్టబెట్టిన కర్ణాటక ప్రభుత్వం
- వాళ్లు ఏమైనా ఏరోస్పేస్ ఆంత్రప్రెన్యూర్లా?
- సిద్ధరామయ్య సర్కార్‌పై విపక్షాల విమర్శలు
Mallikarjun Kharge | బెంగళూరు, ఆగస్టు 25: ముడా, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌లు ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్‌ను కుదిపేస్తుండగా.. మరో సంచలన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ‘సిద్ధార్థ విహార ట్రస్టు’కు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూమి కేటాయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు(కేఐఏడీబీ)కి చెందిన 5 ఎకరాలను కేటాయించారన్న వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ఆదివారం పలు ఆరోపణలు చేశారు. కేఐఏడీబీకి చెందిన మొత్తం 45.94 ఎకరాల్లో ఖర్గే ట్రస్టుకు 5 ఎకరాలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. కేఐఏడీబీ భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబం ఏరోస్పేస్ ఆంత్రప్రెన్యూర్లుగా ఎప్పుడు మారిందని ప్రశ్నిచారు. ఈ వ్యవహారంలో భారీస్థాయిలో అక్రమాలు చోటుచేసుకొన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఏ విధంగా ఆమోదించారు?
‘సిద్ధార్థ విహార ట్రస్టు’లో ట్రస్టీలుగా ఖర్గేతో పాటు ఆయన భార్య రాధాభాయ్, కుమారులు ప్రియాంక్ ఖర్గే(రాష్ట్ర మంత్రి), రాహుల్ ఖర్గే, అల్లుడు రాధాకృష్ణ(గుల్బర్గా ఎంపీ) తదితరులు ఉన్నారని ఎంపీ లహర్ సింగ్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ప్రజల సౌకర్యాల కోసం ఉద్దేశించిన భూమిని ట్రస్టు ఎస్సీ కోటా కింద పొందిందని ఆయన ఆరోపించారు. ఇది అధికారి దుర్వినియోగం, బంధుప్రీతి కాదా? అని ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ కేటాయింపునకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఏ విధంగా ఆమోదం తెలిపారని ప్రశ్నించారు. ఈ అక్రమ భూ కేటాయింపు వ్యవహారం ఒక ఆర్టీఐ కార్యకర్త ద్వారా గవర్నర్ కార్యాలయానికి కూడా చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ భూ కేటాయింపుపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

