Delhi | ఢిల్లీలో అర్ధరాత్రి ఎన్కౌంటర్.. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఎదురుకాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్స్టర్లకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపంలో అర్ధరాత్రి 1:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.
హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చిచంపారు. ఈ గ్యాంగ్స్టర్ల కదలికలపై పోలీసులకు సోమవారం సమాచారం అందింది. దీంతో వారిని పట్టుకునేందుకు వెళ్లగా, గ్యాంగ్స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుల కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే వారిని పట్టుకొని ఆస్పత్రికి తరలించారు. హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

