జడ్జి ముందే 25 రౌండ్ల కాల్పులు..

న్యూఢిల్లీ: కోర్ట్ రూమ్.. వార్ జోన్‌ను తలపించింది. కాల్పుల మోతతో కోర్ట్హాల్ గజగజ వణికిపోయింది. న్యాయవాది దుస్తుల్లో వచ్చిన దుండగులు.. న్యాయమూర్తి ముందే సుమారు 25 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగింది. తుపాకుల శబ్ధాలకు కోర్టుకు వచ్చినవారంతా భయంతో పరుగులు తీశారు. ఓ కేసులో జడ్జి ముందుకు గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని తీసుకువచ్చారు. అయితే అతని ప్రత్యర్థులు ఆ కోర్ట్హాల్కు మారువేషాల్లో వచ్చారు. అడ్వేకేట్ దుస్తుల్లో ఉన్న వాళ్లు .. జడ్జి ముందే గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను చంపేశారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ అప్రమత్తంగా ఉన్న పోలీసులు .. మారువేషాల్లో వచ్చిన ఇద్దర్ని కాల్చేశారు. కోర్టు రూమ్‌లో విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అడ్వకేట్ దుస్తుల్లో ఉన్న ఇద్దర్నీ పోలీసులు హతమార్చారు. సినీ ఫక్కీలో షూటౌట్ జరిగినట్లు ఉన్నా.. అది గ్యాంగ్‌వార్ కాదని ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు. జితేందర్‌ను చంపేందుకు వచ్చిన వ్యక్తుల్లో ఒకరి తలపై నజరానా ఉన్నది. అతన్ని పట్టిస్తే 50 వేల రివార్డు ఉన్నట్లు రాకేశ్ ఆస్తానా తెలిపారు. మారువేషాల్లో వచ్చిన వారిని టిల్లు గ్యాంగ్ వ్యక్తులుగా గుర్తించారు.
#WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today
— ANI (@ANI) September 24, 2021
As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

