Sabarimala Photo Shoot: శబరిమల అయ్యప్ప మెట్లపై ఫోటో దిగిన 23 మంది పోలీసులకు శిక్ష ఏంటో తెలుసా?
Sabarimala Photo Shoot: శబరిమలలో 18 మెట్లపై 23 మంది పోలీసులు గ్రూప్ ఫోటో దిగిన ఘటనలో ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది. ఆ పోలీసులు తక్షణమే సత్ర్పవర్తన కోసం కఠినమైన శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పవిత్రమైన 18 మెట్లపై 23 మంది పోలీసులు గ్రూప్ ఫోటో(Sabarimala Photo Shoot) దిగిన ఘటనలో ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది. ఆ పోలీసులు తక్షణమే సత్ర్పవర్తన కోసం కఠినమైన శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఏపీ క్యాంప్కు చెందిన పోలీసు ఆఫీసర్లు.. ఇప్పుడు కన్నౌర్లోని కేఏపీ-4 క్యాంపునకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ క్యాంపులో సత్ర్పవర్తన పొందేలా పోలీసులకు కఠిన శిక్షణ ఇవ్వనున్నారు. ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఆదేశాల మేరకు శిక్షణ కొనసాగనున్నది. క్రమశిక్షణ చర్యల గురించి హైకోర్టుకు తెలియజేశారు.
అయ్యప్ప సన్నిధానంలో మెట్లపై నిలుచుని ఫోటో దిగిన పోలీసులు తమ వెనుక భాగాన్ని దేవుడి వైపు ఉంచారు. దీని పట్ల వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో.. 23 మంది ఆఫీసర్లను శిక్షణ కోసం వెనక్కి రప్పించారు. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ నుంచి కూడాఏడీజీపీ రిపోర్టును కోరారు.
18 మెట్లపై పోలీసులు ఫోటోషూట్ చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. అయ్యప్ప భక్తులు ఎవ్వరూ దేవుడికి వెన్ను చూపించరని పేర్కొన్నది. ఆలయ పవిత్రతను పోలీసులు దెబ్బతీసినట్లు వీహెచ్పీ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

