గోవా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 15 మంది కరోనా రోగులు మృతి

పనాజీ: గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం మరో 15 మంది కరోనా రోగులు మరణించారు. మంగళవారం ఆక్సిజన్ కొరతతో 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇది జరిగి రెండు రోజులు కాకముందే గురువారం ఉదయం 2 గంటల నుంచి ఆరు గంటల మధ్య 15 మంది కరోనా రోగులు మరణించారు. వీరు కూడా ఆక్సిజన్ కొరత వల్లే చనిపోయి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం తీరుపై బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం మండిపడింది. ఈ మరణాలు కూడా ఆక్సిజన్ కొరత వల్లనే జరిగి ఉంటాయని అభిప్రాయపడింది. ఆక్సిజన్ సరఫరాను ప్రభుత్వం మెరుగు పరచలేదన్న విషయం అర్థమవుతున్నదని విమర్శించింది. అన్నింటిని పక్కన పెట్టి కనీసం ఒక రాత్రి అయినా ఆక్సిజన్ కొరత వల్ల కరోనా రోగులు చనిపోకుండా చూడాలని న్యాయమూర్తులు ఎంఎస్ సోనాక్, నితిన్ జాంబ్రేతో కూడిన ధర్మాసనం సీఎం ప్రమోద్ సావంత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

