BJP Leader | తిరువనంతపురం : కేరళకు చెందిన ఓ బీజేపీ నాయకుడి ఇంట్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. అక్రమంగా నిల్వ ఉంచిన 14 వేల మద్యం బాటిల్స్‌తో పాటు 2,400 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయిలే బీజేపీ లీడర్ లాలూ(50) చెందిన కోళ్ల ఫారం గోడౌన్లో అక్రమంగా విదేశీ మద్యం నిల్వ ఉంచినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో కోడకర ఏరియాలోని వెల్లంచిర సమీపంలో ఉన్న లాలూ గోడౌన్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. గోడౌన్లో ఓ రహస్య గదిని గుర్తించారు. అక్కడ దాచి ఉంచిన 14 వేల మద్యం బాటిల్స్, 2,400 స్పిరిట్‌ను సీజ్ చేశారు. అనంతరం లాలూతో పాటు అతని సహచరుడు లారెన్స్(52) ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరి కొంతమంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి వివరాలు కూడా సేకరించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.