టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలి: తక్కెళ్లపల్లి

సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలో గ్రామ, మండల కమిటీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 గ్రామపంచాయితీలకు గాను 16 గ్రామ కమిటీ లను పూర్తి చేశాం, మిగిలిన గ్రామ కమిటీలను బుధవారం సాయంత్రం వరకు పూర్తి చేస్తామని తెలిపారు.
యువత, మహిళలు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. చిత్తశుద్ధి, క్రమశిక్షణ, పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలకు కమిటీల్లో అవకాశాలు ఇస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షమ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్ రెడ్డి, కూసుకుంట్ల సత్తిరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, వీర మళ్ల వెంకటేశ్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

