సంస్థాన్ నారాయణపురం: చావులోనూ వీడని బంధం.. భర్త మృతి తట్టుకోలేక భార్య మృతి

సంస్థాన్ నారాయణపురం:మూడు ముళ్లు అనే బంధంతో ఏడడుగులు వేసి 70 ఏండ్ల క్రితం ఒకటిగా జీవితాన్ని ప్రారం భించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ బతుకు బండిని లాగించారు. కొన్నేండ్ల క్రితం భర్త అనారో గ్యం బారిన పడడంతో తనకు చేత కానీ వయసులోనూ భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది భార్య.
అకస్మాత్తుగా భర్త మృతి చెందడంతో మరణ వార్త తట్టుకోలేక మనోవేదనకు గురై గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి చెందిన విషాద ఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన ఎడ్ల లక్ష్మయ్య(90) ఎడ్ల లక్ష్మమ్మ (85) వృద్ధ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

కొన్నేండ్లుగా అనారోగ్యంతో ఉన్న లక్ష్మయ్య బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో భర్త మరణ వార్తను తట్టు కోలేక భార్య ఎడ్ల లక్ష్మమ్మ (85) రాత్రి మృతి చెందింది.వీరి కుమారుడు 12 ఏండ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందా డు. దీంతో ఇద్దరు కూతుళ్లు తలకొరివి పెట్టారు.వృద్ధ దంపతులు ఇద్దరు ఓకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

