వజ్రమ్మ ఘన విజయం చేనేత రంగానికి గర్వకారణం : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
వజ్రమ్మ ఘన విజయం చేనేత రంగానికి గర్వకారణం అని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, న్యూఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు..
గట్టుప్పల్, నవంబర్ 11 : వజ్రమ్మ ఘన విజయం చేనేత రంగానికి గర్వకారణం అని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, న్యూఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు బుధవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి వజ్రమ్మ వెంకటేశం దంపతులను శాలువాతో సత్కరించి అభినందించారు. చేనేత రంగ అభివృద్ధికి వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల19 గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగే అభినందన సభ కార్యక్రమానికి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజయవంతం చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సభకు వివిధ చేనేత సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యులు పెద్ద ఎత్తున హాజరుకానున్నట్లు, చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ఈ సభలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కర్నాటి గిరి ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వజ్రమ్మ ఘన విజయం చేనేత రంగానికి గర్వకారణం : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
TN CM Vijay | తమిళనాడు ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై విమర్శలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం విజయ్
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 12 మంది ఎంపిక
‘విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు చెకుముకి సైన్స్ సంబురాల నిర్వహణ’
NHM Employees | 30వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.. చిన్నారులకు అందని టీకాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

