కొలువుకు.. కఠోర సాధన
నిరుద్యోగ యువత పోలీస్ కొలువు కొట్టాలనే లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
- పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు
- చలిని సైతం లెక్క చేయకుడా కసరత్తు
రామన్నపేట, డిసెంబర్ 4 : నిరుద్యోగ యువత పోలీస్ కొలువు కొట్టాలనే లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయమం చేస్తూ, పరుగులు పెడ్తూ సీనియర్ల సలహాలతో ముందుకు సాగుతున్నారు. కొందరు యువకులు వలిగొండ మండలం లోతుకుంట గ్రామం నుంచి రామన్నపేట పట్టణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నారు. సుమారు 100మంది యువత పట్టణ కేంద్రంలోని డిగ్రీ కళాశాలతో పాటు, రైల్వేస్టేషన్ సమీపంలోని గ్రౌండ్లో శిక్షణ చేస్తున్నారు.
ఏదో ఒక ఉద్యోగం పక్కగా సాధిస్తా
నిత్యం 6గంటలు శ్రమిస్తున్న. పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించాలన్నదే లక్ష్యం. కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల కోసం దరఖాస్తు చేసి నిత్యం తీవ్రంగా శ్రమిస్తున్న. ఈవెంట్స్‌లో రాణిస్తానన్న నమ్మకం ఉంది. ఆ దిశగా సీనియర్ల సలహాలు తీసుకుంటున్నా.
– బత్తుల మత్స్యగిరి, లక్ష్మాపురం
పోలీస్ ఉద్యోగం సాధించడం నా కల
పోలీస్ ఉద్యోగం సాధించడం నా కల. అందుకే లక్ష్య సాధన కోసం నిత్యం కష్టపడుతున్న. ఉదయం, సాయంత్రం రోజూ కసరత్తుతో పాటు రన్నింగ్ చేస్తున్నాను. దేహదారుఢ్య పరీక్షల్లో రాణించి తప్పకుండా కొలువు కొడుతా. ఇందుకు సీనియర్ల సలహాలు తీసుకోవడంతో పాటు, గత పరీక్షల మోడల్ పేపర్లను రిఫర్గా తీసుకుంటా.
– పాక నర్సింహ, లోతుకుంట, వలిగొండ
ఒత్తిడికి గురి కావద్దు
ప్రిలిమినరీ పరీక్షలో ఉతీర్ణత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలపై దృష్టి సారించాలి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేయాలి. ఎలాంటి ఒత్తిడికి గురిగాకుండా ప్రశాంతంగా ముందుకుసాగాలి. కొలువు కొట్టడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తే తప్పకుండా విజేతలుగా నిలుస్తారు.
– చింతా మోతీరాం, రామన్నపేట సీఐ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

