బాలికపై లైంగిక దాడి.. ముగ్గురిపై పోక్సో కేసు
ఆమె అభం శుభం తెలియని చిన్నారి. తల్లి లేదు. చదువు సంద్య రాదు. మేకలను కాస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల కన్ను పండింది.
హాలియా, జూలై 17: ఆమె అభం శుభం తెలియని చిన్నారి. తల్లి లేదు. చదువు సంద్య రాదు. మేకలను కాస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల కన్ను పండింది. ఇంకేముందు మాయమాటలు చెప్పి నయాన్నో భయాన్నో ఆ బాలకను లోబర్చుకున్నారు. ఎనిమిది నెలలుగా ఆ బాలికపై లైంగిక దాడి చేశారు. ఆ కామాంధులు చేసిన పాపానికి బాలిక ఆరు నెలల గర్భవతి అయ్యింది.
సభ్యసమాజం తలదించుకునే ఈ అమానవీయ సంఘటన శుక్రవారం అనుముల మండలం కుపాసిపల్లి గ్రామంలో ఆసల్యంగా వెలుగులోనికి వచ్చింది. నల్లగొండ జిల్లా అనుముల మండలం కుపాసిపల్లి గ్రామంలో అభం శుభం తెలియని చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఎనిమిది నెలలుగా లైంగిక దాడి చేశారు. మగాళ్ల రూపంలో ఉన్న ఇద్దరు మృగాలు చేసిన అఘాయిత్యానికి ఆ బాలిక ఆరు నెలల గర్భవతి అయ్యింది.
విషయం బయటకు పొక్కడంతో గ్రామంలో పంచాయితీ పెట్టారు. తప్పు నాది కాదంటే నాది కాదంటూ ఆదిమల్ల అజయ్, బండారు అఖిల్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. విషయం ఆనోటా ఈనోటా బయటకు పోక్కడంతో మీడియాకు తెలిసింది. ఇంకేముంది సోషల్ మీడియాలో విషయం చక్కర్లు కొట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సంఘటనలో ఆదిమల్ల అజయ్, బంగారు అఖిల్‌తో పాటు రాములమ్మను నేరస్తులుగా గుర్తించి వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

