ఆవిష్కరణలకు ఆహ్వానం
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి సమాజానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కల్పించుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చేపట్టే చర్యలపై 2 నిమిషాల నిడివి గల వీడియోను
ఇంటింటా ఇన్నోవేటర్‌కు దరఖాస్తులు
ఆగస్టు 5 చివరి తేదీ
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి సమాజానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కల్పించుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చేపట్టే చర్యలపై 2 నిమిషాల నిడివి గల వీడియోను చిత్రీకరించి ఆవిష్కరణకు సంబంధించిన 4ఫొటోలు, ఆవిష్కర్త పేరు, వయస్సు, గ్రామం, ఆవిష్కర్త వివరణతో 9100678543 నంబరుకు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆవిష్కరణ అంటే…
మనలో కలిగే సృజనాత్మక ఆలోచనే ఆవిష్కరణ. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంతోపాటు సమగ్ర అవగాహన కలిగి ఉండడం ఆవిష్కరణకు దారితీస్తుంది. మన చుట్టూ ఉండే సమస్యలకు సంబంధించి వినూత్నంగా ఆలోచించి పరిష్కారానికి అవలంబించే పద్ధతి సైతం ఆవిష్కరణ అనిపించుకుంటుంది. సమస్య పరిష్కారానికి ఏదైనా వస్తువును విభిన్నంగా తయారు చేయగలిగిన వారే ఆవిష్కర్తలుగా గుర్తించబడుతారు. వారిలోని ప్రతిభను సమాజానికి తెలియజేసేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
ఆగస్టు 5 వరకు దరఖాస్తు గడువు…
ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల దరఖాస్తుకు ఆగస్టు 5 వరకు గడువు నిర్ణయించారు. జిల్లాలోని ఇన్నోవేటర్లు తమ ప్రతిభకు సంబంధించిన వీడియో, చిత్రీకరణ, ప్రయోగాలకు సంబంధించిన ఫొటోలు, తదితర అంశాలతో సకాలంలో 9100678543 నంబర్‌కు వాట్సప్ ద్వారా పంపాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)కు సకాలంలో అందిన దరఖాస్తులను పరిశీలించి ప్రతిభ కలిగిన ఇన్నోవేషన్‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన ఇన్నోవేషన్‌ను ఆయా జిల్లాల్లో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శిస్తారు. అంతేగాకుండా ఆవిష్కర్తకు సర్టిఫికెట్ ప్రదానంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా ఉత్తమ ఆవిష్కరణలకు సాంకేతిక సహకారాన్ని అందించనున్నారు. ఆవిష్కరణలకు సంబంధించి సలహాలు, సూచనలు, సందేహాల నివృత్తి కోసం జిల్లా సైన్స్ అధికారి భరణికుమార్ 9000989726 నంబర్‌ను సంప్రదించాలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

