‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
– నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ
నీలగిరి, అక్టోబర్ 21 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు ఎంతో కీలకమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ధైర్యం, కర్తవ్యనిష్ఠ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. పోలీస్ విధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధతతో కూడిన పవిత్రమైన కర్తవ్యమన్నారు. నల్లగొండ జిల్లాలో విధి నిర్వహణలో ఇప్పటివరకు 15 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులయ్యారని, దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 154 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని ఎస్పీ తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమరులైన పోలీసుల త్యాగాలు ఎప్పటికీ మరచిపోలేనివని, వారి సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు గౌరవాభివందనాలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ కె.శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

