కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
నిడమనూరు మండల పరిధిలోని శ్రీ కోటమైసమ్మ అమ్మవారి దేవస్థానంలో తలనీలాల సేకరణ హక్కు, పోగు చేసిన తలనీలాల విక్రయ వేలం ద్వారా రూ.8 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయ ఆవరణలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో తలనీలాల సేకరణ హక్కులు, పోగు చేసిన తలనీలాల విక్రయ బహిరంగ వేలంను...
నిడమనూరు, అక్టోబర్ 28 : నిడమనూరు మండల పరిధిలోని శ్రీ కోటమైసమ్మ అమ్మవారి దేవస్థానంలో తలనీలాల సేకరణ హక్కు, పోగు చేసిన తలనీలాల విక్రయ వేలం ద్వారా రూ.8 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయ ఆవరణలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో తలనీలాల సేకరణ హక్కులు, పోగు చేసిన తలనీలాల విక్రయ బహిరంగ వేలంను నిర్వహించారు. వేలంలో పాల్గొనేందుకు ముగ్గురు వేలందారులు డిపాజిట్ చెల్లించగా సాయంత్రం వేళలో నిర్వహించిన వేలంలో నాగర్ కర్నూల్ కు చెందిన వజ్రగిరి మల్లిఖార్జున్ రూ.7.50 లక్షలకు వేలం పాడి హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది నుండి వచ్చే ఏడాది అక్టోబర్ 31 వరకు తలనీలాలు సేకరించేందుకు మల్లిఖార్జున్ వేలం ద్వారా హక్కులు పొందినట్లు ఆలయ ఈఓ బి.జ్యోతి తెలిపారు. అనంతరం పోగు చేసిన తలనీలాల విక్రయ వేలం నిర్వహించగా రూ.69,300 కు వేలంలో 9.5 కిలోలను కొనుగోలు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణాధికారి విఠలేశ్వర్, ఆలయ ఫౌండర్ ట్రస్టీ చౌటి ఆంజనేయులు, ఆలయ పూజారి చౌటి పద్మ, రేగులగడ్డ ఆంజనయే స్వామి ఆలయ ఈఓ రమణయ్య, ఆలయ సిబ్బంది కోటయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండ్రు విజయరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

